అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుజాతి కోసం అమరజీవి చేసిన త్యాగాన్ని, సేవలను చంద్రబాబు గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. అలాగే 12నెలలు 12 విభిన్న కార్యక్రమాలు చేపడుతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన పడమటిపల్లిలో ఆయన నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామన్నారు. పడమటిపల్లిలో హైస్కూల్ భవనాన్ని పునర్నిర్మించి అమరజీవి పొట్టి శ్రీరామలు పేరు పెడుతామని తెలిపారు. అలాగే గ్రామంలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తమన్నారు. అమరజీవి త్యాగాన్ని, పోరాటాన్ని పుస్తక రూపంలో తీసుకవచ్చి భవిష్యత్తు తరాలకు అందిచాలన్నారు. ఈకార్యక్రమంలో ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ రాకేశ్ తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.