Home తాజా వార్తలు పొట్టి శ్రీరాములు పేరును మార్చాల్సిన అవసరం ఏముంది?: కేంద్ర మంత్రి బండి సంజయ్

పొట్టి శ్రీరాములు పేరును మార్చాల్సిన అవసరం ఏముంది?: కేంద్ర మంత్రి బండి సంజయ్

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరం ఏముందని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సంఘం వాళ్లు ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై ఆర్యవైశ్య సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రి బండి సంజయ్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, స్వాతంత్రోద్యమంలో జైలుకు వెళ్లిన వ్యక్తి అని పేర్కొన్నారు. హరిజనులను దేవాలయాల్లోకి ప్రవేశం కల్పించాలని దీక్షలు చేసిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి  గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత  అని కొనియాడారు. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆంధ్రా మూలాలు ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్టీఆర్ పార్కు, కాసు బ్రహ్మానంద రెడ్డి , నీలం సంజీవరెడ్డి పార్కుల పేర్లను, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పేరును మార్చగలదా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ సర్కారును ప్రశ్నించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here