Home ఆధ్యాత్మికం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

VGన్యూస్: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని గురువారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. డిప్యూటీ సీఎంతోపాటు తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.