గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బిల్డ్‌నౌ పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు . ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు ఆన్లైన్ ద్వారా అందించాలన్న ఉద్దేశంతో ఈ పోర్టల్ తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు పేదోడు, పెద్దోడు అన్న తేడా లేదు. అందరూ పబ్లిక్ డొమైన్లో దరఖాస్తు చేసుకోవలసిందేనని సీఎం స్పష్టం చేశారు. అనంతరం నగరంలో ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి ఈ సందర్భంగా అనుమతి పత్రాలను అందించారు.