Home తాజా వార్తలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, స్థానిక సీనియర్ నాయకుడు ద్యాప గోపాల్ రెడ్డి (గుడియాన్ పల్లి) విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.