VGన్యూస్: చర్చలకు రమ్మని ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రలు విసిరిన సవాల్ పై చర్చించేందుకు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లతోపాటు పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం,తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.







