VGన్యూస్: రైతులకు సకాలంలో యూరియా దొరకడంలేదని మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు హాజరైందుకు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరే సమయంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తనను హైదరాబాద్లోనే గృహనిర్బంధం చేయడం చాలా దుర్మార్గమని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఖండించారు.







