Home క్రీడలు & సినిమా పర్వతారోహకుడు తులసి రెడ్డిని అభినందించిన కేటీఆర్

పర్వతారోహకుడు తులసి రెడ్డిని అభినందించిన కేటీఆర్

VGన్యూస్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన హైదరాబాద్ బౌరంపేటకు చెందిన యువ పర్వతారోహకుడు పాల్పనూరి తులసి రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సత్కరించారు. ఎవరెస్ట్‌తో పాటు ఆఫ్రికా, యూరప్, దక్షిణ అమెరికా ఖండాల అత్యున్నత శిఖరాలను సైతం అధిరోహించిన తులసి రెడ్డి ప్రతిభను కేటీఆర్ కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.