VGన్యూస్: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ తొలి విజయం సాధించింది. ఆదివారం ఎడ్జ్ బాస్టన్ వేదిక జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 64 పరుగుల తేడా తో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు స్మృతి మంధాన 68, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 36, రిచా ఘోష్ 34 పరుగులతో రాణించారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది.










