VGన్యూస్: రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి పలు జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్గా రూ. 50.73 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ప్రధానంగా రూ. 36.65 కోట్లతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రూ. 14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాల్లో బాల బాలికల క్రీడా శిక్షణకు సంబంధించిన వివిధ అకాడమీలను ప్రారంభించారు.










