VG న్యూస్: కాళేశ్వరంలో 198 కోట్ల రూపాయలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత ప్రాతిపదికన దేవాలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు స్వామి వారిని దర్శించుకుని, పూజలు నిర్వహించి, పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అలాగే కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు










