మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచే బారులు తీరారు. శ్రీశైలం, వేములవాడ, శ్రీకాళహస్తి, కీసరగుట్ట, కాళేశ్వరం, పాలకుర్తి, చెరువుగట్టు, మేడిపల్లి శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం, ఏడుపాయల ఆలయం, పిల్లలమర్రి, వేయి స్తంభాల గుడి, పానగల్,వాడపల్లి, కోటప్పకొండ తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.