VGన్యూస్: గ్రామీణ ప్రాంతాలలోని పేద పిల్లలకు నాణ్యమైన ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ. 250 కోట్లతో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుజుర్నగర్ నియోజకవర్గంలోని కొన్ని వేల మంది గ్రామీణ స్థాయి పిల్లలకు ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ స్టాండర్డ్ మరియు హాస్టల్ సదుపాయంతో విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో 2,500 మంది విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 2027 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి.. 2027-28 అకాడమిక్ సంవత్సరంలో క్లాసులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.







