VGన్యూస్: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం అనంతగిరి పోలీస్ స్టేషన్ ను సందర్శించి, తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణ, పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్ కు వచ్చే బాధితులకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసుల బాధ్యత అన్నారు. అలాగే మహిళా ఫిర్యాదులపై వేగంగా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, సైబర్ నేరాల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










