VGన్యూస్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు (LIG) క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మంచి పేరును నేరుగా ప్రజల నుంచే స్వీకరించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన పేరును సూచించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతిని అందచేస్తామని, సోషల్ మీడియా వేదికగా ఈ అంశంలో బహిరంగ పోటీని నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 వరకు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోటీని నిర్వహిస్తున్నామన్నారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు చెందిన tghd.official పేరుతో ఉన్న ఇన్ స్టా గ్రామ్ ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వివరించారు







