గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....