తెలంగాణలో బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భారాస అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీ,మండలిలో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలు, మంచినీటి కొరతపై ఉభయసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఆ పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.