తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దెశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతొందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు నిర్ణయాలను గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.