Home తాజా వార్తలు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి

భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయా సంఘాల నేతలు సీఎంకు ధన్యవాదములు తెలిపారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపామన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం పేర్కొన్నారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా, ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్ లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుర్చీలో మీ వాడిగా నేనున్నా.. మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here