Home తాజా వార్తలు పంటలు ఎండిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : కేటీఆర్

పంటలు ఎండిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : కేటీఆర్

ఎండిన వరితో బుధవారం శాసనసభ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది కాబట్టే పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే.. ముందుచూపు లేని ఈ ప్రభుత్వమే కారణం అని పేర్కొన్నారు. కేసీఆర్ మీద కోపంతో రాష్ట్ర సర్కారు మేడిగడ్డను ఎండబెట్టడం వలన రైతన్నలకు ఇబ్బంది అవుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన ప్రతి ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటల అంశానికి సంబంధించి కాంగ్రెస్ సర్కారును ఎండగట్టేందుకు.. రైతులకు అండగా భరోసాగా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ పర్యటిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. 22 శాతం కృష్ణా నీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడలేదు.. అందుకే పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here