తెలంగాణ శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం,ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ శాసనసభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ద్రవ్యలోటు రూ.54,009 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2,738 కోట్లుగా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
బడ్జెట్ లోవివిధ రంగాలకు కేటాయింపులు ఇలా..
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.31,605 కోట్లు
వ్యవసాయశాఖ- రూ 24,439 కోట్లు
విద్యాశాఖ- రూ.23,108 కోట్లు
ఎస్సీ సంక్షేమం- రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం- రూ17,169 కోట్లు
బీసీ సంక్షేమం- రూ.11,405 కోట్లు
మైనారిటీ సంక్షేమశాఖ- రూ.3,591 కోట్లు
పౌరసరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు
పశు సంవర్ధక శాఖ- రూ.1,674 కోట్లు
మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు
కార్మిక శాఖ- రూ.900 కోట్లు
చేనేత రంగానికి- రూ.371 కోట్లు
పరిశ్రమల శాఖ- రూ.3,527 కోట్లు
ఐటీ శాఖ- రూ.774 కోట్లు
విద్యుత్ శాఖ- రూ.21,221 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖ- రూ.12,393 కోట్లు
పురపాలక రంగం- రూ.17,677 కోట్లు
నీటిపారుదల శాఖ- రూ.23,373 కోట్లు
రోడ్లు భవనాలు శాఖ- రూ.5,907 కోట్లు
హోం శాఖ- రూ.10,188 కోట్లు
దేవాదాయ శాఖ- రూ.190 కోట్లు
అటవీ, పర్యావరణం- రూ.1,023 కోట్లు
క్రీడలు- రూ.465 కోట్లు
పర్యాటకశాఖ- రూ.775 కోట్లు
ఆరు గ్యారంటీలు- రూ.56,084 కోట్లు
చేయూత పింఛన్లు- రూ.14,861 కోట్లు
మహాలక్ష్మి పథకానికి- రూ.4,305 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు- రూ.12,571 కోట్లు
గృహజ్యోతి- రూ.2,080 కోట్లు
రైతు భరోసా- రూ.18,000 కోట్లు
సన్నాలకు బోనస్- రూ.1,800 కోట్లు
రైతు బీమా- రూ.1,589 కోట్లు
గ్యాస్ సిలిండర్ రాయితీ- రూ.723 కోట్లు
రాజీవ్ ఆర్యోగ్య శ్రీ- రూ.1,143 కోట్లు
రాజీవ్ యువ వికాసం- రూ.6,000 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా- రూ.600 కోట్లు
ప్యూచర్ సిటీ అభివృద్ధికి- రూ.100 కోట్లు
ప్రణాళిక శాఖ-రూ.3,863 కోట్లు
న్యాయశాఖ- రూ.2,453 కోట్లు
రెవెన్యూ శాఖ- రూ.2,369 కోట్లు
సాధారణ పరిపాలన- రూ.1,112 కోట్లు
శాసనసభ వ్యవహారాలశాఖ- రూ.255 కోట్లు