VG న్యూస్: హైదరాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. అభిషేక్ శర్మ 135 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. సన్‌రైజర్స్ బ్యాటర్ల దాటికి ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు.









