Home తాజా వార్తలు సచివాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా.. కవిత అరెస్టు

సచివాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా.. కవిత అరెస్టు

VGన్యూస్: ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యంను కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలన్న సోయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రైతులు పండించిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటూ తెలంగాణ రక్షణ సేన పార్టీ శ్రేణులు శుక్రవారం సచివాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మండుతున్న ఎండలతో వడదెబ్బకు గురై రైతులు కల్లాల్లోనే ఊపిరి వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, మక్కలు, పొద్దుతిరుగుడు పువ్వు, జొన్నలను ఆరబెడుతూ రైతులు కాంటా వేసే వారి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తూకంలో తరుగు తీస్తూ.. తేమ పేరిట కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యంతో పాటు అన్నీ పంటలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కవితతోపాటు ధర్నా చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.