Home జాతీయం & అంతర్జాతీయం తెలంగాణ.. తెలంగాణ భూమి పుత్రుల జాగీరే: పవన్ కళ్యాణ్

తెలంగాణ.. తెలంగాణ భూమి పుత్రుల జాగీరే: పవన్ కళ్యాణ్

VGన్యూస్: తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ నేల బిడ్డలు, తెలంగాణ యువత సాధించుకున్న జాగీరే అని తెలిపారు. నేను దానిని బలంగా నమ్ముతాను అని అన్నారు. నన్ను తెలంగాణ రానివ్వము అని అన్నవారికి మాత్రమే తెలంగాణ మీ జాగీరా అని ప్రశ్న వేశాను. అంతే తప్ప తెలంగాణపై ప్రేమ, తెలంగాణ యువత సాగించిన పోరాటాలపై నా మమకారం ఎప్పటికీ పోదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.