VGన్యూస్: ప్రభుత్వ విద్యా రంగంలో నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా తమ మద్దతును ప్రకటించాయి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రహేజా గ్రూప్, రామ్కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్లు విద్యాశాఖతో ఒప్పందాలు చేసుకున్నాయి. సచివాలయంలో జరిగిన సమావేశంలో రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రామ్కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







