Home క్రీడలు & సినిమా వెల్డన్ అర్జున్.. ఆటను ప్రేమిస్తూనే ఉండు: సచిన్

వెల్డన్ అర్జున్.. ఆటను ప్రేమిస్తూనే ఉండు: సచిన్

VGన్యూస్: లక్నోసూపర్ జెయింట్స్ కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2026 లో శనివారం జరిగిన చివరి మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ కు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా సచిన్ తన కుమారుడి గురించి ఎక్స్ (X) వేదికగా పోస్టు చేశారు.
“వెల్డన్ అర్జున్.. ఈ సీజన్ మొత్తంలో నువ్వు ప్రవర్తించిన తీరు నాకు గర్వంగా ఉంది. ఎల్లప్పుడూ నీ సామర్థ్యాన్ని నమ్ముతూ, ఓపికగా ఉంటూ, నిశ్శబ్దంగా కష్టపడుతూ ఉండు. చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం వేచి చూడాల్సి వచ్చినా సానుకూలంగా ఉన్నావు. క్రికెట్.. నైపుణ్యంతో పాటు ఓపికను కూడా పరీక్షిస్తుంది. ఈరోజు నువ్వు ఆ రెండింటినీ అద్భుతంగా నిర్వహించావు. ఎప్పటిలాగే ఆటను ప్రేమిస్తూనే ఉండు. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ సచిన్ తన కుమారుడి గురించి ఎక్స్ (X) వేదికగా పోస్టు చేశారు.