Home తాజా వార్తలు క్రమశిక్షణే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది: సీపీ సజ్జనార్

క్రమశిక్షణే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది: సీపీ సజ్జనార్

VGన్యూస్: క్రమశిక్షణే పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రామకృష్ణ మఠ్ లో ‘సంస్కార్-2026’ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసే ఈ కేంద్రంలో 1000 మంది స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించడం ఒక అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ లో అతితక్కువ కాలంలోనే చిన్నారులు సాధించిన బహుముఖ ప్రావీణ్యం, ప్రదర్శించిన నైపుణ్యం చూస్తుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. ఇక్కడ పిల్లలు అలవరచుకున్న క్రమశిక్షణే వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది కావాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానందుని బోధనల స్ఫూర్తితో ఈ చిన్నారులు రేపటి భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.