VGన్యూస్: తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ పరిధిలోని డైట్ కళాశాలల్లో సీనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 24 నుంచి జులై 29 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.








