Home తాజా వార్తలు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి రామకృష్ణ

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి రామకృష్ణ

VGన్యూస్: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన తనయుడు రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతిని ఉన్నత స్థానంలో నిలిపిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయాల్లో ప్రజలను మెప్పించారని నందమూరి రామకృష్ణ అన్నారు. పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళలకు ప్రత్యేక హక్కులు, అలాగే ఆస్తులలో వాటాలు ఉండాలని గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్ అని నందమూరి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, షేక్ మీరా, ప్రమీల, సతీష్, తదితరులు పాల్గొన్నారు.