VGన్యూస్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ.99.40 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 2023-24 బడ్జెట్లో రూ.50 కోట్లు, 2024-25 బడ్జెట్లో రూ.100 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రూ.150 కోట్లతో సుమారు 45 శాతం పనులు పూర్తికాగా.. మరో రూ.99 కోట్లు నిధులు విడుదల కావడంతో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరగనున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నిధుల మంజూరుకి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నo ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు.







