VGన్యూస్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం తెలంగాణలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, సంస్కరణలను వివరిస్తూ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేకంగా విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలను వివరించారు. చందన్వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత తొందరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌లో ఎయిర్టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, AI కార్యకలాపాలపైన దృష్టి పెట్టాలి మిట్టల్ కి సూచించారు.
భారతీ పౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందజేస్తామని సునీల్ మిట్టల్ తెలిపారు. ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌గా హైదరాబాద్‌ను పరిగణిస్తున్నామని చెప్పారు. డేటా సెంటర్ల కెపాసిటీని మరింత పెంచడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తెలంగాణలో ఫైబర్ కనెక్టివిటీ మరింత పెంచడంపైన సునీల్ మిట్టల్ ఆసక్తిని ప్రదర్శించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, తదితరులు పాల్గొన్నారు..







