VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రింట్ మీడియా కమిటీ వైస్ ఛైర్మన్ గా వనపర్తి కిషన్ గుప్త నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్త చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ గుప్త మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన అమరవాది లక్ష్మీనారాయణ గుప్తకు, మీడియా కమిటీ ఛైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు.










