VG న్యూస్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయం నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అభిషేక్ శర్మ 135 , క్లాసెన్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ట్రావిస్ హెడ్ 37,ఇషాన్ కిషన్ 25 రన్స్ రాణించారు. సన్‌రైజర్స్ బ్యాటర్ల దాటికి ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితీష్ రాణా 57, సమీర్ రిజ్వీ 41, కేఎల్ రాహుల్ 37, స్టబ్స్ 27 పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లు ఎషాన్ మలింగ 4, హర్ష్ దూబె 3, సాకిబ్ హుస్సేన్ , మదుశనక చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.










