Home క్రీడలు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉప్పల శ్రీనివాస్ నియామకం

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉప్పల శ్రీనివాస్ నియామకం

VG న్యూస్: తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం, సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.