VG న్యూస్: గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ 45 బంతుల్లోనే సెంచరీ (101*) చేశారు. నమన ధీర్ 32 బంతుల్లో 45 పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 199 రన్స్ చేసింది. రబాడ 3 వికెట్లు తీయగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.










