VG న్యూస్: తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తూ పార్టీకి, ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర గొప్పదని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎన్నారైలను అభినందించారు. లండన్ పర్యటనలో ఉన్న సంతోష్ కుమార్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్నారైల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములైన అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతీ ఒక్కరు రాబోయే తరాల కోసం భూమిని, పర్యావరణాన్ని సురక్షితంగా కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు FDC మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










