సీపీఐ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఆ పార్టీ ఖరారు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత సత్యం పేరును ఆదివారం రాత్రి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. కాంగ్రెస్ , సీపీఐ ఎన్నికల పొత్తులో భాగంగా హస్తం పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది.