తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను నడ్డా అభినందించారు. అలాగే రాష్ట్రంలో పార్టీని మరింత బలపరచాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని రాష్ట్ర నేతలకు సూచించారు.