తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ మూడు స్థానాలు, సీపీఐ ఒక స్థానం, భారాస ఒక స్థానం కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ శాసనమండలికి ఎన్నికయ్యారు.