Home తాజా వార్తలు సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం

సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం

VGన్యూస్: పర్యావరణానికి హానికరంగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల పునర్ వియోగంలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. వ్యర్ధాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రదానం చేసే ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారాన్ని శుక్రవారం హైద్రాబాద్ లోని టీజీపీసీబీ కార్యాలయంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ నివేదిత లక్షాధి, కమిషనర్ హనుమంత రెడ్డి అందుకున్నారు.