Home క్రీడలు & సినిమా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన: గంటా శ్రీనివాస రావు

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన: గంటా శ్రీనివాస రావు

VGన్యూస్: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2026 క్రికెట్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా ఏపీఎల్ నిలవాలని ఆకాంక్షించారు. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ కూడా మరింత ఆదరణ పొందుతూ, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభివృద్ధికి దోహదపడాలన్నారు. పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.