Home తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

VGన్యూస్: తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన జగదీశ్ రెడ్డి. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాలనలో విఫలం అయిందన్నారు. యువకులు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, ఇందిరా సోమరాజు, ప్రభాకర్, శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.