Home జాతీయం & అంతర్జాతీయం ఏపీలో వీబీజీ రామ్ జీ పథకాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

ఏపీలో వీబీజీ రామ్ జీ పథకాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

VGన్యూస్: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్‌ను (వీబీజీ రామ్ జీ ) పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు వీబీజీ రామ్ జీ జాబ్ కార్డులు అందజేశారు. వీబీజీ రామ్ జీ పథకం సమాచార బుక్ లెట్‌, కంపెండియం అఫ్ ఆర్టికల్స్‌, మిషన్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, ఏపీ మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే శ్రీధర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.