Home తాజా వార్తలు ఉరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఉరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారిని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీగా ఎన్నికైన 20 ఏళ్ల నాటి మరిచిపోలేని అనుభూతితో గ్రామంలో అడుగుపెట్టిన సీఎంకి ఆత్మీయులు, ఆనాటి పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆనాటి సహచరుల ఆత్మీయ సమ్మేళనంలో తోటి సహచరులను అప్యాయంగా పలకరిస్తూ ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ వారి బాగోగులు అడుగుతూ ముఖ్యమంత్రి గత అనుభవనాలను నెమరువేసుకున్నారు. కొందరు 20 ఏళ్ల కిందట దిగిన ఫోటోలను చూపిస్తూ పాత అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.