VGన్యూస్: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రూ. 47.08 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
అభివృద్ధి పనుల వివరాలు:
* రూ. 10 కోట్లతో ఊరుకొండపేట శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ అభివృద్ధి.
* రూ. 20 కోట్లతో పాత మిడ్జిల్ మండలంలోని 40 గ్రామ పంచాయతీల అభివృద్ధి. (40 గ్రామాలు మండలాల పునర్విభజన తర్వాత ప్రస్తుతం మిడ్జిల్ మండలంలో 24, ఊరుకొండ మండలంలో 16 గ్రామాలు ఉన్నాయి).
* రూ. 17.08 కోట్లతో మిడ్జిల్ మండలంలో చెక్ డ్యామ్ల నిర్మాణానికి శంకుస్థాపన.
* చెక్ డ్యామ్ల వివరాలు: భైరాంపల్లి గ్రామం సమీపంలో దుంధుబి వాగు, వడియాల్ గ్రామం సమీపంలోని చిన్న వాగు (దుంధుబి వాగు), వస్పుల గ్రామం సమీపంలోని వస్పుల కత్వా పునరుద్ధరణ.







