Home ఆధ్యాత్మికం ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకున్న గవర్నర్

ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకున్న గవర్నర్

VGన్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని తొలి పూజ చేశారు. తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్యే దానం నాగేందర్, కమిటీ సభ్యులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి వినాయక విగ్రహం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం అర్చకులు గవర్నర్ దంపతులతో పూజలు చేయించారు.