తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి ఈ సంఘటనే నిదర్శనం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము నిర్వహించబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న భారాస నేతలను కోరారు.