మెగాస్టార్ చిరంజీవి అరుదైన అవార్డును అందుకున్నారు. సినీరంగానికి ఆయన అందించిన సేవలకు గాను బుధవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్” అవార్డును అందజేసింది. అనంతరం యూకే పార్లమెంట్ సభ్యులు, తదితరులు చిరంజీవిని సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిరంజీవికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.