VGన్యూస్: వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుకునేంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించునున్న ఈ పుష్కరాలకు గోదావరి జిల్లాల పారిశ్రామికివేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం చేయాలని సూచించారు.










