VGన్యూస్: ధర్మం,సత్యం,త్యాగానికి ప్రతీకగా మొహర్రం నిలుస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. త్యాగాలను స్మరించుకుంటూ ముస్లిం సహోదరులు మొహర్రంను జరుపుకుంటారని అన్నారు. పీరీల పండుగ పేరుతో తెలంగాణ ప్రజలు సహోదర భావంతో, కుల మతాలకు అతీతంగా పాల్గొంటారని కేసీఆర్ అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని ఈ సందర్భంగా కేసీఆర్ పునరుద్ఘాటించారు.







